వీరభద్రం విజయానికి గ్రామాల్లో ప్రచారం

కారేపల్లి: వైరా నియోజవర్గ సీపీఐ(ఎం) అభ్యర్ధి భూక్యావీరభధ్రంనాయక్‌ విజయాన్ని కాంక్షిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఎర్రబోడు, మాణిక్యారం, కోయగుంపు, రూప్లాతండా, గాదెపాడు, మడెంపల్లి గ్రామాల్లో ప్రచారాన్ని చేపట్టారు. ఈసందర్బంగా ఐద్వారాష్ట్ర ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంకు బుద్ది చెప్పే రోజులు వచ్చాయన్నారు. మహిళలంటే కేసీఆర్‌కు నిర్లక్ష్య దోరణి ఉందని, రాష్ట్ర క్యాబినేట్‌లో మహిళ మంత్రి లేకుండా పాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి అని విమర్శించారు. గిరిజనుల మధ్య చిచ్చుపెట్టటమే కాకుండా పోడుపై జీవిస్తున్న బతుకులపై దెబ్బకొట్టాలని చూశాడన్నారు. గిరిజనుల పక్షాన సీపీఐ(ఎం) అభ్యర్ధి భూక్యా వీరభద్రంనాయక్‌ పోరాటాలు జైలు కెళ్ళారన్నారు. మన వెంట ఉండే మన సమస్యలను పరిష్కరించే వీరభద్రాన్ని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని ఆమె తెలియజేశారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పండగకొండయ్య, కరపటి సీతారాములు, కేలోత్‌ సూర్యకుమార్‌, జంపాల వెంకేటశ్వస్త్రర్ల పగడమ్మ, ఈసం సలీం, లాకావత్‌ బదిలి, నూనావత్‌ వస్రాం తదితరులు పాల్గొన్నారు.