వీవీఐపీల భద్రతకు ఎంత సొమ్ము తగలేస్తారు

– ప్రభుత్వంపై సుప్రీం అసహనం

న్యూఢిల్లీ, ఫ్ఘిబ|రి 14 (టన్శసలక్ఞ్ష): కేంద్ర, రాష్టాల్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీవీఐపీలకు అసాధారణ భదత్ర కల్పించడంపై గట్టిగా మొట్టికాయలు వేసింది. సాధారణ పౌరులను కాదని వీవీఐపీలకు అత్యంత భద్రత కల్పించడంపై మండిపడింది. రాజకీయ నేతలు, సెలబ్రిటీల కోసం ఎంత మేర ఖర్చు చేస్తున్నారో పూర్తి వివరాలు వెల్లడించాలని గురువారం కేంద్ర, రాష్టాల్ర ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది. నాలుగు వారాల్లో నివేదికలు సమర్పించాలని స్పష్టం చేసింది. గురువారం ఓ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘భద్రత అధికారానికి దర్పానంగా మార్పింది. సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై సాధారణ ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని’ వ్యాఖ్యానించింది. ఎంత మంది ప్రజాప్రతినిధులు, వారి కుటుంబాలతో సహా వీవీఐపీ భద్రతా తీసుకుంటున్నారో వారి వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాలకు సూచించింది. అలాగే, వీవీఐపీ పర్యటనల నేపథ్యంలో ఏ నిబంధనల కింద పోలీసులు రోడ్డు మార్గాలను మూసివేస్తున్నారో చెప్పాలని ఆదేశించింది.