వీహెచ్, సర్వేలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి
హైదరాబాద్, జనంసాక్షి: వైఎస్ జగన్ విషయంలో రాజ్యసభ సభ్యుడు వీ. హన్మంతరావు, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్‌రావు బుధవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. బలం లేని, గెలవలేని వీహెచ్, సర్వేలు ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని ఈ సందర్భంగా వారికి ప్రకాశ్ రావు హితవు పలికారు. జగన్ ఏ జైలులో ఉండాలనేది కోర్టు నిర్ణయింస్తుందని ఆయన పేర్కొన్నారు.