వూపిరాడక ఒకే ఇంట్లో ముగ్గురు మృతి
హైదరాబాద్: వూపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. కార్తికేయ కాలనీలో నివసించే ముఖేశ్(30) ఇంట్లో వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటి పెట్టారు. కొద్దిసేపటికే వూపిరాడక ముఖేశ్‌తో పాటు ఆయన భార్య మీనా(27), కుమార్తె(2) అపస్మారక స్థితికి చేరుకున్నారు. పొరుగింట్లో ఉండే ఇందర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఆర్ థోమర్ ముఖేశ్ ఇంట్లోంచి వెలువడుతున్న పొగలు గమనించి తలుపులు బద్దలు కొట్టగా అప్పటికే వారు మరణించారు.