వృద్ధులకు వికలాంగులకు కార్మికుల కు పింఛన్లు మంజూరు చేయటంలో ప్రభుత్వం షరతులు విధించవద్దు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు
మాదగోని జంగయ్య గౌడ్
రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం, జనంసాక్షి):- అర్హులైన వారందరికీ ఎలాంటి షరతులు విధించ కుండ పింఛన్లు మంజూరు చేయాలి అని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంచాల మండల అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీడిఓ కార్యాలయంలో ఈఓ ఆర్డీ తేజ్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమనికి హాజరు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్బాలో మాట్లాడుతూ57 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తాం వికలాంగులకు కార్మికులకు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తాం అని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉన్న పింఛన్లను వివిధ కారణాలతో చాలా వరకు పింఛన్లు తొలగించిన విషయం ప్రజలకు తెలిసిన విషయమే మళ్ళీ ఇప్పుడు మంజూరు అయిన పింఛన్లు వివిద షరతులకారణాలతో తొలగించటం పనిగా పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు చక్రాల వాహనం ఉన్న కుటుంబంలో ఆర్టీసీ కార్మికుడు ఉన్న 5ఎకరాలకంటే భూమి ఎక్కువగా ఉన్న పింఛన్లు మంజూరు చేయటం లేదు మంజూరైన పింఛన్లను కూడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలగించటం మహా దారుణం ఆఖరికి గీత కార్మికుల పింఛన్లు కూడ తొలగిస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని అడుగుతున్నాం ఇప్పట్టికి పేదవాడు పేదవాడి లాగానే ఉండాల కార్లు ఉండ కూడదా లక్ష రూపాయలు ఖర్చు పెడితే కారు వస్తుంది దానికి పింఛను తొలగిస్తారు రేషన్ కార్డు తొలగిస్తారు ఆర్టీసీ కార్మికుల కుటుంబలో పరిస్థితి ఇదే పింఛన్లు మంజూరు కావు మంజూరైన తొలగిస్తారు గతప్రభుత్వంలు ఎప్పుడు కూడా ఇలాంటి షరతులు విధించలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని కట్టుకొని ఉన్న పింఛన్లను కూడా తొలగించటం పని గా పెట్టుకొని పేరుకు మాత్రం57 ఏండ్లు దాటినా ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తున్నాం అని చెప్పు కోవటం సిగ్గు చేటు ఆర్టీసీ ఒక సంస్థ ఆర్టీసీ కార్మికుల కుటుంబం లోఉన్న వృద్ధులకు వికలాంగులకుపించన్లు ఇవ్వాలి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు విధించ కుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో లబ్ది దారులతో కలిసి ఎంపీ డిఓ కార్యాలయం ముట్టడిస్తాం అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ నాయకుడు సపవట్ రామారావు నాయక్,
తదితరులు పాల్గొన్నారు