వృద్ధులపై ప్రేమాభిమానాలు చూపాలి

జిల్లా కలెక్టర్ పమేలా  సత్పతి
 యాదాద్రి భువనగిరి బ్యూరో,జనం సాక్షి.
వృద్ధుల పట్ల ప్రేమ అభిమానం చూపాలని, వారిని సంరక్షించాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు.బుధవారం నాడు చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాయి వృద్ధాశ్రమంలో ఫిజియో థెరపీ కేంద్రాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా హైజెనిక్ చలి కిట్స్, దుప్పట్లను వృద్ధులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  ఫిజియో థెరపీ కేంద్రం వయోవృద్దులకు చాలా ఉపయోగపడుతుందని, వృద్ధాశ్రమంలోని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. వయో వృద్దుల పట్ల ప్రేమ, అభిమానం చూపాలని, వారిని ఈ వయస్సులో ఆశ్రమాలలో వదిలివేయకుండా తమతో పాటే ఉంచుకొని సంరక్షించుకోవాలని, వారి పట్ల మనం చూపే గౌరవం, ఆప్యాయతలను మన పిల్లలు కూడా గమనిస్తారని, తద్వారా కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు.కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, వయో వృద్ధుల సంక్షేమ అధికారి కృష్ణవేణి, గ్రామ సర్పంచ్ కె.రమేశ్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, సాయి వృద్ధాశ్రమం ప్రతినిధి అశోక్, తదితరులు పాల్గొన్నారు.