వెంకయ్యనాయుడి ఇంటిని ముట్టడించిన టి.అడ్వొకేట్స్ జేఏసీ

హైదరాబాద్: తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంటిని ముట్టడించారు. న్యాయవాదులు బంజారాహిల్స్‌లోని మంత్రి ఇంటిని ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ర్టానికి వెంటనే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి హైకోర్టును విభజించి వెంటనే తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు.