వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి: ఈటెల
కరీంనగర్,ఆగస్ట్7(జనంసాక్షి): సీఎం కేసీఆర్ కుటుంబం కూలికి పోయి డబ్బులు తేవడం లేదని, మన డబ్బులే మనకు పంచి పెడుతున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ తన రాజీనామతోనే సీఎం కేసీఆర్ అడుగు బయట పెట్టారని చెప్పారు. ఇటీవల ఈటల రాజేందర్ మోకాలికి ఆర్థోస్కోపి సర్జరీ జరిగింది. వారం, పదిరోజులపాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని భావించారు. ఆయన హుటాహుటిన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి నియోజకవర్గానికి వచ్చారు. ఆయన వెనుక ఇదే కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నిక ఈ నెలలోనే జరుగుతుందనే దానికి ఈ రెండు అంశాలే నిదర్శనమని కొందరు పేర్కొంటుండగా మరికొందరు ఇప్పట్లో ఉప ఎన్నిక జరగదని అంటున్నారు.