వెడ్డింగ్‌ కార్డుతో భలే ప్రచారం


మళ్లీ మొదలయ్యిందికి భలే క్రేజీ
సుమంత్‌ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్‌ విూడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే సోషల్‌ విూడియాలో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్‌ కార్డ్‌ నిజజీవితానికి సంబంధించింది కాదని, సుమంత్‌ నటిస్తున్న ’మళ్ళీ మొదలైంది’ సినిమా షూటింగ్‌ కోసం ప్రింట్‌ చేసిందని ఆ తర్వాత బయటపడిరది. ఇంతలోనే రామ్‌ గోపాల్‌ వర్మ లాంటి దర్శకుడు ’ఒకసారి చేదు అనుభవం ఎదురైనా మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డావా?’ అంటూ సుమంత్‌ కు ట్విట్టర్‌ వేదికగా క్లాస్‌ తీసుకున్నాడు. ఆ వార్తకూ విపరీతమైన ప్రచారం జరిగింది. నిజం చెప్పాలంటే? ఇదంతా పబ్లిసిటీలో భాగంగానే జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే సుమంత్‌ ఎవరో కాదు.. రామ్‌ గోపాల్‌ వర్మ ’ప్రేమకథ’తో పరిచయం చేసి హీరో! ఇక ’మళ్ళీ మొదలైంది’లో హీరోయిన్‌ నైనా గంగూలీనీ టాలీవుడ్‌ కు తీసుకొచ్చింది రామ్‌ గోపాల్‌ వర్మే! సో వీరిద్దరూ జంటగా నటిస్తున్న ’మళ్ళీ మొదలైంది’ సినిమా గురించి వర్మకు తెలియకుండా ఉండదు. సో వీరంతా కలిసే ఈ వ్యవహారం నడిపి ఉంటారనడంలో సందేహం లేదు. ఏదేమైనా? సుమంత్‌ గత చిత్రాలకు, ప్రస్తుతం సెట్స్‌ పై ఉన్న సినిమాలకు రాని ఫ్రీ పబ్లిసిటీ ఈ శుభలేఖ, వర్మ ట్వీట్‌ తో ’మళ్ళీ మొదలైంది’కి వచ్చేసింది. సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఆ మధ్య విడుదలైంది. డైవర్స్‌, రీ మ్యారేజ్‌ అనే అంశంపై తెలుగులో వస్తున్న మొదటి సినిమా తమదే నంటూ సుమంత్‌ చెబుతున్నారు. విశేషం ఏమంటే? ఇది న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ అనేది విషయం ఆ పోస్టర్‌ చూస్తే అర్థమైపోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది. దీన్ని యంగ్‌ హీరో నితిన్‌ సోషల్‌ విూడియా ద్వారా రిలీజ్‌ చేశాడు. ’ఏంటో ఏమో జీవితం? ఎందుకిలా చేస్తాదో జీవితం’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా సాయిచరణ్‌ పాడాడు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించాడు. కాస్తంత భిన్నంగా దీన్ని సినిమా షూటింగ్‌ ప్రారంభం నుండి మేకింగ్‌ కు సంబంధించిన సీన్స్‌ తో నడిపారు. దాంతో ప్రధాన తారాగణంతో పాటు టెక్నీషియన్స్‌ కూ ఈ వీడియోలో చోటుదక్కింది. హీరోహీరోయిన్లు సుమంత్‌, నైనా గంగూలీతో పాటు పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ’వెన్నెల’ కిషోర్‌ తదితరులు ఇందులో ఉన్నారు. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ లో చక్కటి ఫ్యామిలీ బాండిరగ్‌ కూడా ఉందని ఈ లిరికల్‌ వీడియో చూస్తే అర్థమౌతోంది.