వెనకబడిన ప్రాంతాలపై నిర్లక్ష్యం

విజయవాడ,సెప్టెంబర్‌13(జనంసాక్షి): కొత్త రాష్ట్రం ఏర్పడ్డాకైనా రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాలకు న్యాయం జరగాల్సివుందని సిపిఎం కార్యదర్శి పి.మధు తెలిపారు. రైల్వేజోన్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని అన్నారు. ఇచ్చిన హావిూలను అమలు చేసే చిత్తశుద్ది చాటుకోవాలని అన్నారు.  రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు ప్రబలి, ప్రజల ప్రాణాలు బలైపోడానికి ప్రభుత్వం పబ్లిక్‌ హెల్త్‌ను నిర్వీర్యం, నాశనం చేసే విధానాలే కారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో దివీస్‌ యాజమాన్యానికి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికులకు కనీస హక్కులు లేకపోయినా, బాయిలర్లు పేలి శ్రామికులు చనిపోయినా యాజమాన్యంపై కనీస చర్యల్లేవన్నారు.