వెనుకబడిన తరగతులకు తీరని అన్యాయం..

దామాషా ప్రకారం కేటాయించాలన్న బీసీ సంఘాల ప్రతినిధులు
నెల్లూరు,నవంబర్‌9 (జనం సాక్షి):   సమాజంలో సగభాగం పైనే బీసీ కులాలకు దామాషా ప్రకారమే రాయితీలు ఇవ్వాలని వారు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలను ఆయా కార్పొరేషన్‌ల ద్వారా అందించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరింది. దరఖాస్తులు చేసుకోక ముందే బీసీ కులాలకు చెందినవారు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాన్ని చూసి నోరెళ్ల బెడుతున్నారు. ఎందుకంటే 129 కులాల్లో 15 లక్షలకుపైగా ఉన్న బీసీల్లో 900 మందికి మాత్రమే సబ్సిడీ రుణాలు మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ కులాలు సమాజంలో 145 ఉన్నాయి. వారిని ఏబీసీడీఈ కేటగిరీలుగా విభజించారు. వీరిలో సీ, ఈ, కేటగిరికి చెందిన క్రిస్టియన్‌, మైనార్టీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటయింది.  ప్రభుత్వ తీరుపై బీసీలు మండిపడుతున్నారు. కులాలే బారెడు, సబ్సిడీ చారెడు లా ఉందంటున్నారు. ప్రభుత్వం జిల్లా జనాభాను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. బీసీలకు న్యాయం చేయాలని  బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి రాము డిమాండ్‌ చేశారు. /ూష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం చేస్తున్నది. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అన్ని రంగాల్లో50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం హర్షణీయం. బ్యాంకుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలకు రూ.100కోట్లు కేటాయించాలన్నారు.