వెన్నెలైనా..! చీకటైనా..!! అంటూ మాకు చీకట్లు మిగిల్చారా కృష్ణ గారూ..???
రణ రంగంలో ఇద్దరు పోరాడితే అది యుద్ధం.. కురుక్షేత్రంలో రెండు సమూహాలు తలపడితే అది పోరాటం.. అడవిలో యుద్ధ నీతికి అతీతంగా రెండు సింహాలు కలబడితే అది భీకర పోరు.. ఈ పోరాటాల అంతిమ లక్ష్యం ఒక్కటే..! సాహసం.. ఆధిపత్యం.. నట శేఖర, సూపర్ స్టార్ కృష్ణ సినీ, రాజకీయ మజిలీ కూడా ఇలాంటి సాహసోపేత ప్రస్థానమే..! సినీ పరుశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి కష్టాన్నే నమ్ముకొని సినీ వినీలాకాశంలో ధ్రువతరగా నిలదొక్కుకున్నారు కృష్ణ గారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా కృష్ణ చూపిన తెగింపు నా భూతో న భవిష్యతి.. సినిమాలను వినోదం పంచడం కోసమే కాకుండా, సమాజంలో మార్పు కోసం, వాస్తవాలను ప్రజలకు ఆవిష్కరించే క్రమంలో సినిమాల ఇతి వృత్తాన్ని సాహసోపేతంగా తెరకెక్కించడంలో కృష్ణ గారు ఆయనకు ఆయనే సాటి.. ఆయనకు ఆయనే పోటీ..!! తనతో సినిమా నిర్మించి నష్టపోయిన నిర్మాతలకు రెండో అవకాశం ఇస్తూ చివరి వరకూ ప్రోత్సహించిన ఏకయిక కథానాయకుడు కృష్ణ గారు.! వెన్నెలైనా చికటైనా అని అన్నా, ఆకాశంలో ఒక తార అని పాడినా, అగ్నిపర్వతంలా పేలిపోయినా చెక్కు చెదరని ఆదరణ సినీ ప్రేమికుల నుండి పొందగలిగారు.. ఇంత తొందరగా మీరు మా నుండి విడిపోయి మాకు చీకట్లు మిగుల్చుతారని కలలో కూడా ఊహించలేదు కృష్ణ గారు..! మీరు లేరన్న సత్యాన్ని జీర్ణించుకోవడం మా వల్ల ఆవుతుందా చెప్పండి..? మళ్ళీ మీ చిరు నవ్వు, మీ హావభావాలు, మీ నటన చూసే భాగ్యం దక్కుతుందా..?ఉబికి వస్తున్న దుఃఖాన్ని మునిపంటితో బిగిసి పడుతూ కన్నీటితో వీడ్కోలు చెప్పక తప్పడంలేదు కృష్ణ గారు..! సెలవు..!!!!