వెల్దుర్థిలో దొంగల బీభత్సం

సంగారెడ్డి, జూలై 29 : మెదక్‌ జిల్లా వెల్దుర్థి పోలీస్‌స్టేషన్‌ పరిధి అక్కింపేట, గోపాకృష్ణపురం గ్రామాలల్లో శనివారం రాత్రి 10 ఇళ్ల తాళాలు పగులకొట్టి రెండిళ్లలో దొంగతనం జరిగింది. గోపాలకృష్ణాపురం గ్రామానికి చెందిన సన్నపునేని కోటేశ్వరరావు ఇంటి తాళాలు పగులకొట్టిన దోపిడి దొంగలు రెండు తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండిని దొంగలించారు. అట్లూరీ వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు ఇండ్ల తాళాలు పగులకొట్టారు. అచ్చంపేటలో భవాని పెంటయ్య ఇంట్లో అరతులం బంగారం కమ్మలు, నాలుగువేల రూపాయల నగదు దోపిడి చేసినట్లు బాధితులు తెలిపారు. కుయ్యబాలరాజ్‌ ఇంట్లో ఆరువేల నగదు దొంగిలించారు. నర్సయ్య ఇంటి ముందు ఉన్న సైకిల్‌ను, నాగలక్ష్మీ, కిష్టయ్య, మోతిలాల్‌, వెంకటేశంల ఇళ్ల తాళాలు పగుల కొట్టారు. ఇన్‌స్పెక్టర్‌ రాజేందర్‌, ఎఎస్‌ఐ యాదవరెడ్డిలు ఘటనాస్థలాలను పరిశీలించి వెలిముద్రలను సేకరించారు. సన్నపునేని కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దుర్తి ఎస్‌ఐ అశోక్‌రెడ్డి తెలిపారు.