వెల్లివిరిసిన ఓటరు చైతన్యం
` ఆదర్శంగా నిలిచిన సంగాయిపేట తండా
` 100 శాతం పోలింగ్ నమోదు
మెదక్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్‌లో మెదక్ జిల్లాలోని సంగాయిపేట తండా వాసులు ఆదర్శంగా నిలిచారు. కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100శాతం పోలింగ్ నమోదైంది. ఈ తండాలో మొత్తం 210 ఓట్లు ఉన్నాయి. అందులో 95 మంది పురుషులు ఉండగా, 115 మంది మహిళలున్నారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 100 శాతం పోలింగ్ నమోదు కావడంతో ఆ తండా ప్రజలను జిల్లా కలెక్టర్ అభినందించారు.