వెల్లివిరిసిన మానవత్వం
– ఆయేషాకు దాతల చేయూత – 32 వేల సాయం అందజేత
– చొరవ చూపిన ‘జనంసాక్షి’కి అభినందన
కరీంనగర్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి):
అంగవైకల్యాన్ని ఎదిరించి ఆత్మవిశ్వాసంతో చదు వులో రాణిస్తున్న జగిత్యాకు చెందిన విద్యార్థి ఆయేషాకు పెద్ద ఎత్తున దాతలు చేయూ తనం దించారు. ఆమెను ప్రోత్సహించేందుకు జనంసాక్షి దిన పత్రిక చొరవ చూపి, విరాళాలకు విజ్ఞప్తి చేసి ిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయేషాపై పలు మానవీయ కథనాలు, విరాళాల విజ్ఞప్తి కోసం ‘జనంసాక్షి’ వార్తలను ప్రచురిం చింది. దీనిపై స్పందించిన చాలా మంది మానవ తావాదులు ఆ విద్యా కుసుమానికి తమ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. అం తే కాకుండా, కొందరు పేరు వెల్లడించడానికి ఇష్ట పడని దాతలు కూడా తమ సాయాన్ని పత్రిక కార్యాలయానికి చేరవేశారు. ‘జనంసాక్షి’ ద్వారా విజ్ఞప్తులు అందడం మూలాన పత్రిక ద్వారానే తమ సాయాన్ని ఆయేషాకు అందజేశారు. ఈ మే రకు శనివారం ఆయేషాను కలిసిన కరీంనగర్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ విజయేందర్‌రెడ్డి చేతుల మీదుగా రూ.32 వేలను ఆయేషాకు అందించా రు. దీనిపై స్పందిస్తూ ఆయేషాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు దాతలకు పేరు పేరునా కృతజ్ఞ తలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయేషా మాట్లా డుతూ తనకు చేయూతనందించిన దాతలకు కృ తజ్ఞతలు తెలుపుతూ, తన కష్టాన్ని నలుగురికి తెలి సేలా చేసి, తనకు సాయమందించేందుకు కృషి చేసిన జనంసాక్షి దినపత్రికకు రుణపడి ఉంటాన ని తెలిపింది. తనను అందిన ప్రోత్సాహానికి తగ్గ ట్టుగా చదువులో రాణించి, భవిష్యత్తులో కలెక్ట ర్ గా ఎదిగేందుకు కృషి చేస్తానని ఆయేషా తెలిపిం ది. ‘జనంసాక్షి’ ఎడిటర్ ఎం.ఎం. రహ్మాన్, జగిత్యాల రూరల్ సీ.ఐ. గౌస్‌బాబా పాల్గొన్నారు.