వేదమంత్రోచ్చరణలతో వైభవంగా సాయిబాబా చండీ హోమం

ఎలిగేడు: ఎలిగేడులో సాయిబాబా ఆలయంలో ఆదివారం వైభవంగా చండీ హోమం నిర్వహించారు. వేదమంత్రోచ్చరణలతో సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం, రుద్రాభిషేకం జరిపారు. మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి మొక్కులు చెల్లించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయాల కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, సాయిబాబా ఆలయ వ్యవస్థాపకుడు కట్ల మురళి…. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.