వేద సీడ్స్ విత్తనాల వల్ల దిగుబడి ఎక్కువ.
నెరడిగొండఅక్టోబర్20(జనంసాక్షి) :రైతులకు పత్తి పంట దిగుబడిపై వేద సీడ్స్ రీజినల్ మేనేజర్ మహేష్ పలు సూచనలు చేశారు.బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన మునిగల శ్రీధర్ అనే రైతు చేనులో గురువారం పత్తి పంట క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది.వేద సీడ్స్ వారి సదానంద్ గోల్డ్ బిజీ 2పత్తి వంగడాలను రైతులకు చూపించడం జరిగింది.ఈ విత్తనాల వల్ల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందని రీజనల్ మేనేజర్ మహేష్ తెలిపారు.ఈ సందర్భంగా రైతులకు పత్తి పంటపై పలు సూచనలు చేశారు.పంట ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో సేల్స్ ఆఫీసర్ అల్లకొండ పోతన్న కిషన్ ప్రశాంత్ డిస్ట్రిబ్యూటర్లు 12మంది డీలర్ల తోపాటు చాలా మంది రైతులు పాల్గొన్నారు.