వేమన వర్సిటీ వీసీని రీకాల్ చేయాలి
ఎఐఎస్‌ఎఫ్ డిమాండ్
కడప, జూలై 30 : యోగివేమన యూనివర్సిటీలో జరిగిన అవకతవకలకు, అవినీతికి కారణమైన వైస్‌ఛాన్సలర్ రామచంద్రారెడ్డిని వెంటనే రీకాల్ చేయాలని, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కడప కలెక్టరేట్, పొద్దుటూరు, మైదుకూరు తాసిల్దారు కార్యలయం వద్ద ధర్నాలు జరిగాయి. ఈ ధర్నాలో కలెక్టరేట్ వద్ద జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ వేమన యూనివర్సిటీ అభివృద్ధి పనులలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయినాయని, అవినీతి చోటు చేసుకున్నాయని ఎసిబి నిర్థారించిందని చెప్పారు. ఆ మేరకు తిరుపతిలో కేసులు కూడా నమోదైనాయని అన్నారు. అయినప్పటికి అధికారులు వైస్‌ఛాన్సలర్‌ను ఇంకా కొనసాగించడం మంచిది కాదని అన్నారు. వైస్‌ఛాన్సలర్‌ను వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. అలాచేస్తే తప్ప విచారణ సక్రమంగా జరగదని తెలిపారు. నిష్పక్షపాతం విచారణ కోసం వైస్‌ఛాన్సలర్ రామచంద్రారెడ్డిని ప్రభుత్వం వెంటనే రీకాల్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో అన్ని విభాగాలలోను అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విచారణ పూర్తిచేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.