వేములవాడలో విరిగిన ధ్వజస్తంభం

వేములవాడ,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా వేములవాడలో వీచిన  భారీ ఈదురు గాలులకు రాజరాజేశ్వరస్వామి ఆలయ సముదాయంలో ధ్వజస్తంభం విరిగి పడిపోయింది. జోరున వర్షం, ఈదురుగాలులకు వేణుగోపాలస్వామి ఆలయం ముందున్న ధ్వజస్తంభం విరిగిపోయింది. 30 ఏళ్ల క్రితం దీన్ని ప్రతిష్టించారు. ఏడాది క్రితమే దీనికి ఇత్తడి కవచం అమర్చారు. ఈ సంఘటన వెనుక పాలకవర్గం నిర్లక్ష్యం ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. ధ్వజస్తంభం విరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.