వేర్వేరు ఘటనల్లో ఇద్దరికి గాయాలు
కుల్కచర్ల : మంలంలోని జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చాపలగూడెం గ్రామానికి చెందిన తెదేపా నాయకులు నర్సింహులు మండల కేం5దానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న అటో ఢీకోట్టింది.దీంతో అయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మహబూబ్‌నగర్ అసుపత్రికి తరలించారు. అంతారం నుంచి కుల్కచర్లకు ద్విచక్రవాహనంపై వస్తున్న ఎన్టీవసతి గృహం వార్డెన్ లచ్యానాయక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన వార్డెన్‌ని అసుపత్రికి తరలించారు.