వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ట్రావెల్‌ బస్సును తాకిని విద్యుత్‌ తీగలు: ఒకరు మృతి

రోడ్డు ప్రమాదదంలో వైద్యుడు మృతి

కాకినాడ,జూన్‌25(జ‌నం సాక్షి ): వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు విద్యుత్‌ షాక్‌తో మరొకరు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వెలమకొత్తూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు విద్యుత్‌ తీగలు తగలడంతో ప్రమాదానికి గురైంది. వెలమకొత్తూరు గ్రామం దగ్గర బస్సుకు 11కెవి విద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో కరెంట్‌ షాక్‌ తగిలి ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయడపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సవిూపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడిని సత్తెనపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక బ్యారేజి సవిూపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వైద్యుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతుడిని నిడదవోలుకు చెందిన పచలంక శ్రీకాంత్‌(32)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున శ్రీకాంత్‌ రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.