వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

సూర్యాపేట,నవంబర్‌ 8 (జనం సాక్షి) : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరఖాత్‌ గూడెం వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ ఢీకొట్టి ఆగిపోయింది. వెంటనే వెనక ఉన్న కారు బొలెరో వాహనాన్ని వేగంగా ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుడు ఉత్తర ప్రదేశ్‌ చెందిన వ్యక్తిగా గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. లారీ ఢీకొని మెడికో విద్యార్థిని దుర్మరణం చెందిన సంఘటన విశాఖపట్నంలోని పోర్టు రోడ్డులో జరిగింది. మెడికో విద్యార్థిని స్నేహితులతో కలిసి లంబసింగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.