వేలంపాటలో రూ.6.57 కోట్లు రాబట్టిన కళాఖండాలు

ముంబయి:దక్షిణ భారతదేశం ఇతివృత్తంగా రూపొందించిన కళాఖండాలు గోవా,చోలమండళం, ఇటీవల నిర్వహించిన ఒక వేలంపాటలో రూ.6.57 కోట్ల మొతాన్ని రాబట్టాయి.వీటిలో ఎఫ్‌.ఎన్‌.సౌజా అనే చిత్రకారుడు గీసిన చిత్రం అత్యదికంగా రూ.60 లక్షలకు అమ్ముడుపోయింది.దాని తర్వాత రూ.48 లక్షలతో కె.రామానుజం చిత్రం అత్యధికంగా చిత్రం నిలిచింది.ఈ వేలంపాటను ఈనెల 21న ముంబయిలో ‘ఓసియన్‌ సంస్థ నిర్వహించింది.మెత్తం 120 కళాఖండాలను వేలంలో ఉంచితే 70 అమ్ముడుపొయాయి.ఇదే సంస్థ క్రియేటివ్‌ ఇండియా సిరిస్‌ పేరుతో వేర్వేరు చరిత్రాత్మక అంశాలపై బెంగల్‌,పంజాబ్‌,ఢిల్లీ కేంద్రాలుగా ఇటీవల మూడువే లంపాటలను నిర్వహించింది.ఇవన్నీ కూడా విజయవంతం కావటంపై ఓసియన్‌ ఛైర్మన్‌ నెవిల్లీటులీ మాట్లాడుతూ ఓవైపు ఆర్థికసంక్షోభం మరోవైపు కళాభిమానులు ప్రముఖ అర్టిసులు గీసిన చిత్రాలను మాత్రమే కొనుగోలు చేయటానికి మొగ్గు చూపు తున్న నేపధ్యంలో ఈ వేలంపాటలు అందరి ఆకర్షిస్తున్నాయని తెలిపారు.