వేశ్య పాత్రలో అర్చన

హైదరాబాద్‌ : సినీ నటి అర్చన వేశ్య పాత్రలో కనిపించబోతున్నారు. లవిత యూనివర్సల్‌ ఫిలిమ్స్‌ పతాకంపై వస్తున్న ‘కమలతో నా ప్రయాణం’ చిత్రంలో అర్చన వేశ్య పాత్రలో నటిస్తున్నారు. శివాజీ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి నరసింహనంది దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌ సారాథి స్టూడియోలో శనివారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి క్లాస్‌ కొట్టగా… బాలాదిత్య కెమెరా స్విచ్‌ అస్‌ చేశారు. అదాల ప్రభాకర్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. పావలాశ్యామల, మల్లారెడ్డి, గుండు హనుమంతరావు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.