వైకల్య విజేతకు 32వేల సాయం అందించిన ‘జనంసాక్షి’ పాఠకులు
జగిత్యాల: వైకల్య విజేతను ప్రోత్సహిద్దామంటూ ‘జనంసాక్షి’లో పక్షం రోజులపాటు వరుసగా ప్రచురించిన కథనానికి విశేషస్పంధన లభించింది. ఈ వైకల్య విజేతకు దాతలనుంచి 32,000 వేల సాయం అందింది. ఈ మొత్తన్ని డా|| విజయేందర్ రెడ్డి చేతులమీదుగా అందించారు. జగిత్యాల పట్టణంలోని నిరుపేద కుటుంబమంలో జన్మించిన అయేషాకు రెండు చేతులు, ఒక కాలు పని చేయవు కాని చదువు కోవాలనే తపన, లక్ష్యం చేరాలనే ఆశతో అడుగుముందుకేసి వైకల్యాన్ని జయిస్తూ పదవతరగతిలో 529మార్కులు సాధించి ఇంటర్మీడియట్‌లో కూడా మంచి మార్కులు సాధించింది. కాళ్లతోని పరిక్షలు రాయటమే కాదు కంప్యూటర్ సైతం ఆపరేట్ చేసే ఈ చదువుల తల్లీని ఇంకా ఉన్నతమైన చదువులు చదివించాలంటే ఈ నిరుపేద తండ్రి సలీముధ్దిన్‌కి సాధ్యపడలేదు అందుకే దాథల సాయం కోరాడు. అందుకే వైకల్య విజేతను ప్రోత్సహిద్దామంటూ జనంసాక్షిలో పక్షం రోజులపాటు వరుసగా ప్రచురించాము.