వైద్యం సరిగా చేయలేదని డాక్టర్ కాళ్లు, చేతులు విరిచారు

మెదక్: వైద్యం సరిగా చేయలేదని రోగి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఆస్పత్రికి తీసుకు వచ్చచిన ఒక రోగికి డాక్టర్ ఆశీర్వాదం వైద్యం చేశారు. అయితే వైద్యం సరిగా చేయలేదని అతని బంధువులు ఆగ్రహంతో డాక్టర్పై దాడి చేశారు.

ఈ దాడిలో డాక్టర్ ఆశ్వీర్వాదం కాళ్లు,చేతులు విరిగాయి. అతనికి ఆస్పత్రిలో వైద్యం చేస్తున్నారు.  అతని పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.