వైద్యశాఖలో 4 కోట్ల నిధులు వెనక్కి

ఇకపై సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే విడుదల
గుంటూరు,నవంబర్‌9 (జనం సాక్షి):  జిల్లాలోని బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న నిధులను సరెండర్‌ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి తొలివిడతగా నాలుగు కోట్ల నిధులు సరెండర్‌ చేశారు. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఉన్న నిధులను సవిూకరించి ప్రభుత్వానికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంవిూద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి సుమారు 15కోట్ల నిధుల వరకు ప్రభుత్వానికి జమచేస్తారని అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం జిల్లాలో సీజనల్‌ వ్యాధులైన వైరల్‌ ఫీవర్‌, డెంగీ, మలేరియా జ్వరాలు అధికంగా ఉండటంతో పీహెచ్‌సీల్లో ఉన్న నిధులను కొంతకాలం తర్వాత జమ చేసే అవకాశం ఉంది.  నిధులను ప్రభుత్వానికి సరెండర్‌ చేయడం వల్ల తాత్కాలికంగా రెండు, మూడు నెలల పాటు ఇబ్బంది తప్పేలా లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సల పారితోషికం, జననీ సురక్ష యోజన, రాష్టీయ్ర బాల సురక్ష యోజన, ఇమ్యునైజేషన్‌ ఖాతాలతోపాటు బ్యాంకులో నిల్వలకు వచ్చిన వడ్డీని కూడా కలపి సరెండర్‌చేశారు. ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫోన్‌, నెట్‌ బిల్లులతో పాటు ఆయిల్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సుమారు నాలుగు నెలలుగా నిర్వహణ పనులకు నిధులు విడుదల కాలేదు. దీంతో కొంత కాలంపాటు ఆరోగ్య శాఖకు ఇబ్బందులు తప్పేలా లేవని చెబుతున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలకు విడుదల చేసే హెచ్‌డీఎస్‌ నిధులను మాత్రం సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి మినహాయించారు. వాటిని నేరుగా ఆసుపత్రులకు కేటాయిస్తా రు. ఇప్పటికే సిబ్బంది వేతనాలు మొత్తం సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే చెల్లిస్తున్నారు. పథ కాల నిధులను కూడా అదే పద్ధతిలో చెల్లిస్తే ఆర్థిక విధానం సమగ్రంగా ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకు న్నట్లు అధికారులు భావిస్తున్నారు.