వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, శిశువు మృతి

కరీంనగర్‌: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీతోపాటు శిశువు మృతి  చెందింది. హుస్నాబాద్‌ మండలం మండాపూర్‌ గ్రామాకిని చెందిన ఆకల రజితను ప్రసవం కోసం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి ఐదు రోజుల క్రితం తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. అయితే ప్రసవించిన కొద్ది సేపటికే శిశువు మృతిచెందింది. పదినిమిషాల తర్వాత తల్లి  మరణించింది. వైద్యురాలు అందుబాటులో లేని కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముంద ఆందోళన చేపట్టారు.