వైద్య కళాశాలకు ఎన్ఎంసి గ్రీన్ సిగ్నల్.

-కొత్తగూడెంలో వైద్య కళాశాల నెలకొల్పిన సీఎం కేసీఆర్ కి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

జనంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగష్టు 26:-

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కొత్తగూడెం ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని సహకారం చేస్తూ వైద్య కళాశాల మంజూరు చేసి ప్రవేశాలకు ఈ విద్యా సంవత్సరం నుంచి అనుమతి కూడా కలిగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర రావు కి, జిల్లా ప్రజల తరఫున వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, కళాశాల మంజూరైన వెంటనే 150 మంది విద్యార్థుల ప్రవేశానికి అనుమతి కూడా వచ్చిందని,వైద్య కళాశాల ఏర్పాటుతో ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది, ఎన్ఎంసి అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉంది ప్రజలను ఆరోగ్యంగా చేయడానికి కాలేజీ నెలకొల్పిన సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటామని అన్నారు.
అదేవిధంగా పినపాక ప్రభుత్వాసుపత్రికి , అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం మంగపేట ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం రెండు ప్రభుత్వాసుపత్రికి ఒక్కో PHC 1,5600000 మొత్తం 3,1200000 సీఎం కేసీఆర్ కి, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినది కానీ తెలంగాణ రాష్ట్రంకు మొండిచేయి చూపిందని అన్నారు.
ఇక్కడ బిజెపి నేతలు మాటలు కోటలు దాటుతున్నాయని, మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కేంద్రంలోని బిజెపి మొండి చేయి చూపిన సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.ఇటీవల కోవిడ్ 19 మహమ్మారి తర్వాత ప్రజా ఆరోగ్య మీద బాగా అవగాహన పెరిగింది, ప్రజలు, ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాయి, ప్రభుత్వ రంగలలో గాని ప్రైవేట్ రంగాల్లో గాని పెద్ద ఎత్తున ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి అవసరమైన అన్ని వసతులు సమకూర్చుకుంటున్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లకి కృషికి మంచి ఫలితాలు వచ్చాయి ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల మలేరియా డెంగ్యూ, వంటి వ్యాధులు తగ్గాయి, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆరోగ్య సూచకలలో కూడా గణనీయమైనా పూర్వ అభివృద్ధి సాధించాల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది అన్నారు.