వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు.

తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాల యంలో సోమవారం బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించా రు.ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ పాటలతో ఆటలాడుతూ అలరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదా యాలకు నిలువెత్తు నిదర్శనం బతు కమ్మ పండుగ అన్నారు. వి వివిధ పూలతో బతుకమ్మను అలంకరించి ఆడి పాడి సంస్కృతి కేవలం తెలంగాణలో ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.