వైభవంగా శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు
మల్లాపూర్: మల్లాపూర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా స్వామి వారికి శనివారం చక్రస్నానం, పుష్పయాగాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం గావించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ఛైర్మన్ సంజీవరెడ్డి, భాజపా జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, భక్తులు పాల్గొన్నారు.