వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామిమహా పడిపూజ..

జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆదివారం రాత్రి నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా కొనసాగింది. ఆశ్రమ ఆవరణంలో ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి సర్వంగా సుందరంగా రంగురంగుల పువ్వులతో అలంకరించారు. ముందుగా శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ అయ్యప్ప చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీఅయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, నిర్వహించారు. పదునెట్టంబడిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వాముల పెటతుల్లి భక్తులను ఆకట్టుకుంది. అనంతరం పదునెట్టంబడిపై దీపాలు వెలిగించారు.
ఆద్యంతం కన్నులపండువగా సాగిన  మహా పడిపూజలో అయ్యప్ప స్వాములు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయాన అయ్యప్ప మాలదారులైన వీరారెడ్డి అయ్యప్పస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అయ్యప్ప స్వామిలు నిర్వహించిన భజన కార్యక్రమంలో  వీరారెడ్డి పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి కీర్తనలకు స్టెప్పులు వేసి భక్తులను, అయ్యప్ప స్వాములను మంత్రముగ్ధుల్ని చేశారు.
భక్తి భావంతో మానసిక ప్రశాంతత: అవధూత గిరి
ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధుతగిరి మహారాజ్, ఉత్తరాధికారి డాక్టర్ సిద్దేశ్వర స్వామి పేర్కొన్నారు. ఆశ్రమంలో జరిగిన మహా పడిపూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవ చింతనతోనే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. దీక్షల వల్ల ఆధ్యాత్మిక చింతన తో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంనికి జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్, మొగుడంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో హాజరయ్యారు

తాజావార్తలు