వైభవోపేతంగా జన్మదిన వేడుకవైభవోపేతంగా జన్మదిన వేడుక
* ఘనంగా సన్మానించిన కొండల్ ముదిరాజ్
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 20 :- వేల సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు అభిమానుల సమక్షంలో మేడ్చల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భాషవోని కొండల్ ముదిరాజ్ అన్నారు సోమవారం షామీర్పేట్ మండల పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్దగల సిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలకు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి మహేందర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించి పూల గుచ్చాలను అందించి కేకులు కట్ చేసి స్వీట్లు తినిపించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కొండల్ ముదిరాజ్ మాట్లాడుతూ మహేందర్ రెడ్డి నిష్కల్మషమైన హృదయంతో ప్రజలకు పార్టీ శ్రేణులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అత్యుత్తమైన సేవలందించే మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు