వ్యక్తిగత ఖాతాలను ఫ్రీజ్ చేయడం సరికాదు.

లబ్ధిదారుడే డ్రా చేసుకునేలా అవకాశం కల్పించాలి.

జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్.

అమ్మపురంలో జిఎంపిఎస్ నాయకులకు సన్మానం.

తొర్రూరు 09 అక్టోబర్ (జనంసాక్షి )
గొల్ల కురుమలకు నగదు బదిలీకి ఒప్పుకున్న ప్రభుత్వం అకౌంట్లను ఫ్రీజ్ చేయడం సరికాదని.వ్యక్తిగత ఎకౌంట్లో నుండి లబ్ధిదారుడే డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలం అమ్మాపురం గ్రామంలో
గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం పోరాటాలతో ప్రభుత్వ దిగివచ్చి నగదు బదిలీకి ఒప్పుకోవడంతో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం నాయకులను శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం గ్రామ సొసైటీ అధ్యక్షుడు పల్లె బీరయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బొల్లం అశోక్ మాట్లాడుతూ గొర్రెలు మేకల పెంపకం దారుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘం జీఎంపిఎస్ అని ఆయన అన్నారు. గొర్రెల మేకల పెంపకం వల్లనే సంగం రెండు సంవత్సరాల నిర్వి రామ పోరాటం వల్లనే రాష్ట్ర ప్రభుత్వ దిగివచ్చి నగదు బదిలీకి ఒప్పుకుందని అన్నారు. ఈ నగదు బదిలీ పథకాన్ని ఒక్క మునుగోడుకే పరిమితం చేయకుండా రాష్ట్రమంతట అమలు చేయాలని అన్నారు. గొల్ల కురుమల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకం కాస్త పక్కదారి పట్టకుండా నగదు బదిలీ ఒప్పుకున్న ప్రభుత్వం లబ్దిదారుల వ్యక్తిగత ఖాతాలను ఫ్రీజ్ చేసి గొర్రెల కాపరులను ఆందోళనలకు గురిచేయడం సరికాదని.. ఈ నగదు బదిలీ వల్ల గొల్ల కురుమలు మాత్రమే అభివృద్ధి చెందేలా లబ్ధిదారుల వ్యక్తిగత అకౌంట్ల నుండి లబ్ధిదారుడేలా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించకపోతే ఆదాడు జరిగిన అవకతవకలే ఇప్పుడు జరిగే ప్రమాదాలు లేకపోలేదని ఆయన అన్నారు. గొర్రెల పంపిణీ పథకం ఎన్నికల కోసమే కాకుండా… గొల్ల కురుమల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు కొమ్మనబోయిన యాకయ్య, మండల కార్యదర్శి ఎద్దు ఐలయ్య, చేను రామకృష్ణ, గ్రామ పెద్దగొల్ల మద్దెల రాజు, బట్ట మేకల కొమురయ్య, ఉడుత వెంకన్న, మద్దెల సంతోష్, కొమురయ్య, సురేష్, యు. రమేష్, సైదులు, కృష్ణమూర్తి, కుమార్, రజిని, నక్క బిక్షం, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


Sent from Email.Avn for mobile

Attachments area