వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి కావాలి
నల్లగొండ,డిసెంబర్15 (జనంసాక్షి):- స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ దీనిని తమదిగా భావించాలని, గ్రామ సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ తీసుకుని పూర్తి చేయాలని అన్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హావిూ సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలను తయారు చేసుకోవలన్నారు. అనేక గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసినట్లు వివరించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హావిూ సిబ్బంది ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుని నిర్ధిష్ట గడువులోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. మండల పరిషత్ అధికారులు నిరంతరం పర్యవేక్షించి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో కూడా ఎలాంటి జాప్యం జరగకుండా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ మరుగుదొడ్లు లేని వారిని గుర్తించాలన్నారు. గడువులోగా బహిరంగ మల, మూత్ర విసర్జన లేని గ్రామపంచాయతీలుగా గుర్తించాలని సూచించారు. ఇందుకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.