వ్యభిచార కూపంనుంచి ఐదుగురు బాలికలకు విముక్తి
వరంగల్: ఉద్యోగాలు, ప్రేమ పేరుతో బాలికను మోసం చేసి వ్యభిచార కూపాలకు అమ్మే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర బళార్షా జిల్లా చంద్రాపూర్‌లో వ్యభిచార గృహాలపై వరంగల్ పోలీసులు దాడి చేశారు. వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఐదుగురు బాలికలకు వ్యభిచార కూపంనుంచి విముక్తికల్పించారు. వ్యభిచార గృహ నిర్వాకురాలితో పాటు నలుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ లావణ్య నాయక్ తెలియజేశారు.