వ్యవసాయంపై సమగ్రవిధానం ఏది?
– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
రంగారెడ్డి,ఆగస్ట్19(జనంసాక్షి):
తెలంగాణలో 900 మంది రైతులు చనిపోతే టీఆర్‌ఎస్ నేతలు కనీసం పరామర్శించిన పాపాన పోలేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సిఎం కెసిఆర్ కనసీం రైతలను పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ ఎండను సైతం లెక్కచేయకుండా ఆదిలాబాద్‌లో పర్యటించారని, ఆ మాత్రం కూడా కెసిఆర్‌కు తీరిక లేదా అని ప్రశ్నించారు.సర్కారు వద్ద వ్యవసాయం పై సమగ్రవిధానం లేదన్నారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన అన్నారు. అంతుకు ముందు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. చిలుకూరు సవిూపంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ… పేదలకు ఇళ్లు కేటాయించాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కోట్లాది నిధులతో ఇళ్లు నిర్మించినా పేదలకు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వానిదని విమర్శించారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేయాలన్నారు.