వ్యవసాయ, రెవెన్యూ శాఖలే కీలకం
కామారెడ్డి,మే2( జనం సాక్షి): రైతుబంధు పథకం అమలులో వ్యవసాయ, రెవెన్యూ శాఖలే కీలక పాత్ర పోషించనున్నాయి. కలెక్టర్ నుంచి వీఆర్వో వరకు, డీఏవో నుంచి ఏఈవో వరకు అన్ని స్థాయిల అధికారులు చెక్కుల పంపిణీ పర్యవేక్షణ, ఇతరత్రా సమస్యల పరిష్కారానికి బాధ్యులుగా ఉంటారు. ఇది వరకు రూ.4
వేల సాయాన్ని ఎలా ఇవ్వాలనే అంశంపై ఫీల్డ్ స్థాయిలో పరిశీలన జరపగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు జిల్లాలోని అత్యధిక శాతం రైతులు చెక్కుల పంపిణీకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో బ్యాంకులు,
రైతు వివరాలతో ముద్రించిన చెక్కులు రానుండటంతో వీటి పంపిణీకి సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానికంగా ఉండని రైతులు, విదేశాల్లో ఉన్నవారికి వారి కుటుంబ సభ్యులకు చెక్కులను అందించడం వంటి సాంకేతిక సమస్యలను స్థానిక ఉన్నతాధికారుల సమక్షంలోనే నిర్ణయిస్తారు. రైతులకు గల భూమి విస్తీర్ణానికి అనుగుణంగా లెక్కించి చెక్కులను ముద్రిస్తున్నారు.