వ్యవసాయ రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి

 టీపీసీసీ సెక్రెటరీ భూక్యమంగీలాల్ నాయక్ డిమాండ్

టేకులపల్లి ,ఆగస్టు 13( జనం సాక్షి) : వ్యవసాయ రైతులకు ఎస్బిఐ బ్యాంకు ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని టి పి సి సి కార్యదర్శి భూక్య మంగీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలోని ఎస్బిఐ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టేకులపల్లి మండలం పూర్తిగా ఏజెన్సీ మండలం కావడంతో పేద గిరిజనులే ,వ్యవసాయమే జీవనాధారంగా నివసిస్తున్నారని, అలాంటి రైతులకు ఈ ఏడాది అతివృష్టి వలన రైతులకు ఆదిలోనే తీవ్ర నష్టం వాటిల్లిందని, పెట్టుబడులకు సైతం ఇప్పటికే అప్పుల పాలై ఉన్నారని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న రైతులందరికీ ఎస్బిఐ బ్యాంకు ద్వారా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని ఆయన మేనేజర్ ని కోరారు.
మండలంలో అతిపెద్ద బ్యాంకు గా నెలకొన్న ఎస్బిఐ బ్యాంకు ద్వారానే మండలంలోని రైతులందరికీ రైతులకు రుణాలు మంజూరు చేయగలుగుతారని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించవద్దని బ్యాంకు ద్వారానే రుణాలు మంజూరయ్యే వరకు పోరాడుదామని రైతులందరూ కలిసి రావలసిందిగా ఆయన పిలుపునిచ్చారు .ఎస్సీ సెల్ జిల్లా నాయకులు రాస మల్ల నరసయ్య ఎనగంటి అర్జున్ రావు ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూక్య దేవా నాయక్ బానోతు సరి లాల్ నాయక్ మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు ఆకారపు స్వప్న తదితరులు పాల్గొన్నారు.