వ్యవసాయ విధానాలపై ఇతర రాష్ట్రాల అధ్యయనం
24గంటల కరెంట్..రైతుబందు పథకాలపై ఆసక్తి
హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైపు యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. పలు రాష్ట్రాలు ప్రశంసలతో ముంచెత్తు తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకొండని ఓ మాడల్‌గా ప్రభుత్వాన్ని చూపిస్తున్నాయి. ఛత్తీస్‌ఘడ్,జార్ఖండ, ఒడిషా తదితర రాష్ట్రాలు ఇక్కడ అమలువుతన్న విధానలు పరిశీలించాయి. ఇకకడ రైతుల కోసం చేస్తున్ కార్యక్రమాలను అధ్యయనం చేశారు. విత్తన భాండాగారంగా చేస్తున్న కృషిని పరిశీలించారు. అందుకే కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రైతు ప్రభుత్వంగా ఆశీస్సులు పొందుతోంది. అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేందుకు సమాయత్తమైంది. ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు పునర్జీవన పథకం, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణను సశ్యశ్యామలం చేయాలని దృడ సంకల్పంతో పనులు చేస్తుంది. ఈ ఫలాలు ఇప్పుడిప్పుడే అందడం ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో తెలంగాణ రైతాంగం దేశంలోనే ధనవంతులుగా అవుతారనడంలో ఇక అతిశయోక్తి లేదు. జిల్లాల వారీగా వ్యవసాయ భూమెంత అనే విషయాల్లో స్పష్టత వచ్చింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఎకరాకు 4వేల రూపాయల చొప్పున రెండు పంటలకు 8వేల రూపాయలను అందించే బృహత్తర పథకానికి నాంది పలకడంతో రైతుల్లో బరోసా వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన దరిమిలా దాని ఆధారంగా రైతుబంధును విజయవంతంగా అమలు చేశారు. గతంలో పంట నష్టం పేరిట ఇన్‌పుట్ సబ్సిడీ అంటూ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందించే మొత్తాన్ని ఈ విధంగా రైతులు ప్రమేయం లేకుండానే కోతలు కోసిన చరిత్ర బ్యాంకర్లకున్నది. దీన్ని ప్రధాన సమస్యగా రైతు భావిస్తున్నాడు. సీజన్‌కు ముందుగా పంటకు కావాల్సిన పెట్టుబడిని అందించే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది కాబట్టి.. ఆ లక్ష్యం నెరవేరాలంటే సాగుకు సమాయత్తమవుతున్న తరుణంలోనే ఈ పెట్టుబడి ఆర్థిక సహాయం రైతులకు అందాలి. అప్పుడు ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుంది. అందుకే రైతుబంధును విజయవంతంగా అమలుచేయడలిగింది. చెక్కు వెనుకవైపున ఆధార్ నంబర్‌తో అందిస్తే ఆ రైతు ఏ బ్యాంకులో నైనా నగదును తీసుకొని దాన్ని పెట్టుబడిగా తను చేసే వ్యవసాయానికి వినియోగించుకో గలుగుతాడని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది కొత్త ఏడాది కానుకగా 24 గంటల కరెంటును అందిస్తున్నది.ఇప్పుడది నిరంతరాయంగా సాగుతోంది. రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందించడంలో దేశంలోనే ప్రథమమని ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి అన్నారు. అయితే దీనిని కూడా జీర్ణింకోలేని విధంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసి మొన్నటి ఎన్నికల్లో భంగపడ్డారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. రైతుల సంక్షేమ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. రైతులకు రెండు పంటల సాగుకోసం ఎకరానికి రూ.8 వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేయడం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని చెప్పారు. వచ్చే వానకాలం నాటికి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పాలమూరు ఎత్తిపోతలు పూర్తయితే 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో కృష్ణా జలాలను తరలించి బీడు పొలాల్లో పంటలు పండేలా చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.