వ్యాక్సినేషన్‌లో భారత్‌ రికార్డు


24 గంటల్లో 88.13 లక్షల మందికి కోవిడ్‌ టీకా
న్యూఢల్లీి,ఆగస్ట్‌17(జనంసాక్షి): కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 88.13 లక్షల మందికి కోవిడ్‌ టీకా ఇచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ తన ట్విట్టర్‌లో వెల్లడిరచారు. ఒకే రోజు అత్యధిక సంఖ్యలో టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 55.47 కోట్ల మందికి కోవిడ్‌ టీకాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇండియాలో ఇవాళ అత్యల్ప సంఖ్యలో కోవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కేవలం 25,166 మందికి వైరస్‌ సోకింది. డెయిలీ పాజిటివిటీ రేటు 1.61 శాతంగా ఉంది.

తాజావార్తలు