వ్యాట్‌కు నిరసనగా వ్యాపారుల రాస్తారోకో

మెట్‌పల్లి పట్టణం: వస్త్రాలపై ప్రభుత్వం విధించిన వ్యాట్‌కు నిరసనగా వ్యాపారులు మెట్‌పల్లిలో ఆందోళన బాట పట్టారు. పట్టణంలోని పాత బస్టాండు వద్ద 63వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యాపారులపై ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దాదాపు గంటపాటు రోడ్డుపై రాస్తారోకో చేయటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ఆందోళనకు తెదేపా నాయకులు మద్దతు తెలిపారు. పోలీసుల జోక్యంతో వ్యాపారులు ఆందోళన విరమించారు.