వ్యానులో యజమాని మృతి

జ్యోతినగర్‌,టీ మీడియా: సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుకు విడిభాగాలు తీసుకొస్తున్న ఓ వ్యానులో మృతదేహం లభ్యమైంది. ఈ వ్యాన్‌ చెన్నై నుంచి రావడం, అందులో మృతదేహం ఉడడం పలు అనుమానాలను రేకేత్తిస్తున్నాయి. వ్యాను వెనకాల నిద్రిస్తున్న యజమాని, ఓసీపీ గేటు వద్దకు వచ్చే సరికి అందులోనే శవంగా మారడం సంచలనం రేకేత్తించింది. వ్యాన్‌ను అజాగ్రత్తగా నడపడం వలననే విడిభాగాల మధ్య చిక్కుక పోయి చనిపోయాడా? మరే కారణమైనా ఉందా అన్నది మిస్టరీగా మారింది. సింగరేణి మేడిపల్లి ఓసీపీకి విడి భాగాలను ఏపీ 28ఎక్స్‌-9248 నంబర్‌ గల డీసీఎం వ్యానులో చెనై నుంచి తీసుకొస్తున్నారు. వ్యాను యజమాని జి. సంపత్‌ రెడ్డి(26) ఓసీపీ వద్దకు వచ్చేసరికి అదే వ్యానులో శకమయ్యాడు. మృతుడు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ప్రాంతానికి చెందినవాడు.
వ్యాన్‌ యజమాని సంపత్‌రెడ్డి, సయ్యద్‌ జానీ, బాలకృష్ణ ఈ నెల 29న రాత్రి 9గంటలకు చెన్నైలోని టీఎంటీ ట్రాన్స్‌పోర్టు నుంచి జేసీసీ ఎక్స్‌కవేటర్‌కు సంబంధిండిన విడి భాగాల లోడ్‌తో బయల్దేరారు. వ్యాన్‌ వరంగల్‌లో రెండు ట్రాక్టర్లను అన్‌లోడ్‌ చేసి నేరుగా శనివారం కరీంనగర్‌కు చేరుకునేసరికి రాత్రి కావడంతో, అక్కడే వ్యాన్‌ క్యాబిన్‌ వెనుక ముగ్గురు అందులోనే బస చేశారు. ఆదివారం ఉదయం 6.30గంటల ప్రాంతంలో మళ్లీ అ్కడ్నించి బయల్దేరారు. అప్పటికి సంపత్‌ రెడ్డి వ్యాన్‌ను మీరే నడపమంటూ డ్రైవర్‌, క్లీనర్లకు సూచించి వ్యానులోనే నిద్రించాడు. ఎన్టీపీసీ సమీపంలొని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్‌ వద్దకు చేరుకునే సరికి వ్యాను వెనుకాల నిద్రిస్తున్న యజమాని చనిపోయి ఉన్నాడు.
కాగా వ్యానులోని విడి బాగాలను ఓ ప్రైవేటు కాంట్రాక్టర్‌కు దిగుమతి చేయుల్సి ఉంది. కాగా, ఓపెన్‌కాస్టు వద్దకు వచ్చేసరికి వ్యాన్‌ డ్రైవర్‌, క్లీనర్‌ మజమాని సంపత్‌ను లేపేసరికి చనిపోయి ఉన్నట్టు తెలిపారు. సంఘటన విషయం తెలుసుకోని ఎన్టీపీసీ పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని వారి బంధువులకు అప్పగించారు. వ్యాన్‌లోని విడిభాగాలు తగిలి శ్వాస ఆడక అందులోనే చనిపోయి ఉంటాడని పోలీసులు బావిస్లున్నారు.