వ్యాపారరంగాల్లోనూ రిజర్వేషన్‌


ఉద్యమంలా దళితబంధు
`పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది
` దళితజాతి సమగ్ర వికాసం లక్ష్యంగా పథక రూపకల్పన
` ఇప్పటి వరకు ఒక ఎత్తయితే..ఇకనుంచి మరో ఎత్తు
` దళితుల దరిద్రం, సామాజికి వివక్ష తరతరాలుగా బాధిస్తోంది
`వారి జీవితాల్లో ఇంకా చీకట్లే అలుమున్నాయన్నది కఠోర వాస్తవం
` గోల్కొండ కోట నుంచి పంద్రాగస్టు ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటన
హైదరాబాద్‌,ఆగస్టు 15(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ఉద్యమంగా మారుస్తూ.. నవశకానికి నాంది పలుకుతున్నామని సిఎం కెసిఆర్‌ అన్నారు. దేశంలో సరికొత్త చరిత్రను సృష్టించి.. దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని పరిఢవిల్లేలా చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణా ప్రభుత్వం దళితబంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ పథీకం దేశానికి ఆదర్శంగా నిలిచి దేశం యావత్తూ అమలు చేసేలా నిలుస్తుందని అన్నారు. యనదేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యమని, దీనిని ఎవరూ కాదనలేరని అన్నారు. దీనికి మన రాష్ట్రం కూడా అతీతం కాదు. దళితజాతిని దారిద్యర్ర ఒక్కటే కాదు, ఆ వర్గం పై ఉన్న సామాజిక వివక్ష కూడా తరతరాలుగా బాధిస్తున్నది. స్వాతంత్యర్ర వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళితుల జీవితాల్లో ఇంకా చీకటే అలుముకొని ఉందనే కఠోర వాస్తవాన్ని మనమందరం అంగీకరించి తీరాలి. దేహంలో కొంతభాగాన్ని ఖండిరచితే ఆ దేహం కుప్పకూలుతుంది. అదే విధంగా దేశంలో ఒక పెద్ద ప్రజాసమూహాన్ని అణచివేస్తే ఆ దేశం కూడా కుప్పకూలుతుందనే నిజాన్ని అందరూ గ్రహించాలన్నారు. ప్రజాస్వామ్యమంటే సమానవత్వమే. వీలయినంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి, దళితుల అభివృద్ధి అందుకు మొదటి సోపానం కావాలని అన్న భారత రాజ్యంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మాటల్లోని గంభీరతను దేశ పరిపాలనా వ్యవస్థలన్నీ ఇప్పటికైనా గ్రహించాలన్నారు.తెలంగాణా ఏర్పడిన నాటి నుంచి అణగారిన కులాల వికాసం దిశగా ప్రభుత్వం బలమైన అడుగులువేసింది. దళితులలో విద్యా వికాసం చోటు చేసుకోవాలి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్‌ స్కూళ్ళను స్థాపించింది. 2014 తెలంగాణా ఏర్పడేనాటికి దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్‌ స్కూళ్ళ సంఖ్య కేవలం 134 మాత్రమే. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో కొత్తగా 104 స్కూళ్ళు ఏర్పాటు చేసింది. ఈరోజు రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్‌ స్కూళ్ళ సంఖ్య 238కి పెరిగింది. ఈ ఏడెండ్లలో ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రగతి నిధి కింద కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే, మిగిలిన నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దళిత విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసించేం దుకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్షిప్‌ పథకం ద్వారా 20 లక్షల రూపాయల అత్యధిక మొత్తాన్ని స్కాలర్‌షిప్‌గా అందిస్తున్న ఒకేఒక ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం మాత్రమే అన్నారు. దళితజాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజానికి ప్రధాన బాధ్యత. అది ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రాథమిక విధి. అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవసేవ. మానవసేవే మాధవసేవ అని మహాత్ముడు ఏనాడో పేర్కొన్నాడు. ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు
సమాజమంతా అండగా నిలవాలి. ఈర్ష్య, అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటివిూద నిలవాలి. దళిత సమాజానికి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. కులం పేరిట నిర్మించిన ఇనుపగోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణా ప్రభుత్వం దళితబంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది. అణగారిన దళితజనం ఒక్క ఉదుటున లేచి నిలబడి, స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే మహాసంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళితబంధు ఉద్యమం అని రాష్ట్ర ప్రజలకు సవినయంగా మనవి చేస్తున్నాను. దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, తద్వారా సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించడమే లక్ష్యంగా పెట్టుకొని స్వయంగా నేనే దళితబంధు పథకానికి రూపకల్పన చేసాను. మహాత్మా జ్యోతీరావు ఫూలే, భారత రత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మహాశయుల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు, దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నానని వివరించారు. ఈ సంవత్సరం బ్జడెట్‌ లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం నిధులు మంజూరు చేసింది. రేపటి నుంచి ఈ పథకాన్నిమన రాష్ట్రంలోని హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టు కింద సంపూర్ణంగా అమలుచేస్తుంది. రాష్ట్రంలోని మిగతా నియోజక వర్గాలలో పాక్షికం గా అమలు చేస్తుంది. గత ప్రభుత్వాలు దళితులకు అందించిన చిన్న చిన్న రుణాలు, సబ్సిడీలు వంటి అరరకొర సహాయాలతో వారిలోని ఆర్తి తీరలేదు. వారి పరిస్థితిలో గణనీయమైన మార్పు రాలేదు. అందుకే దళితబంధు కింద యూనిట్‌ పెట్టుకోవడానికి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దళితబంధు ఆర్థిక సహాయాన్ని లబ్దిదారుని పేరున ఉన్న ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమచేస్తుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా 10 లక్షల రూపాయలను పూర్తిగా గ్రాంటు రూపంలో అందజేస్తుంది. దీంతో లబ్దిదారుడికి వాయిదాలు చెల్లించాలనే ఆందోళన ఉండదు. ప్రశాంతంగా తన జీవనోపాధిని కొనసాగించుకోగలుగుతాడు. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సొమ్ముతో ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకొనే పూర్తి స్వేచ్ఛ లబ్దిదారునికే ఉంటుంది అని సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు.