వ్యాపార వర్గాల పై కక్షసాధింపు ధోరణి విడనాడాలి.ఎమ్మెల్యే ఎంపీ, ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి.సిపిఐ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి

.
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్:పట్టణ అభివృద్ధి పేరుతో జాన్ పాడు రోడ్డు, రాంపురం రోడ్డు,పాత నేరేడుచర్ల రోడ్డులలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరో మూడు రోజుల్లో దుకాణాలు అన్నింటినీ కూల్చివేస్తామని,మార్కు చేసి వ్యాపార వర్గాల ను భయబ్రాంతులకు గురి చేయడం తగదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి  ధూళిపాళ ధనంజయ నాయుడు అన్నారు.శుక్రవారంనాడు ఆయన నేరేడుచర్ల లో ఏఐవైఎఫ్ జిల్లా కన్వినర్ చిలకరాజు శ్రీను తో కలిసి  మాట్లాడుతూ,దాదాపు నేరేడుచర్ల  పట్టణం మూడు వంతుల భాగం ఇప్పటికే ధ్వంసం అయింది అని, మిగిలిన ఆ మిగతా భాగాన్ని ధ్వంసం చేసేందుకు అటు అధికారులు.ఇటు కాంట్రాక్టర్ అత్యుత్సాహంతో ఉన్నారని, కానీ వారికి కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని,ఆ తర్వాతే షాపులు కూల్చివేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని,లేదా ప్రత్యామ్నాయంగా వారికి షాపులు చూపించాలని,ఎమ్మెల్యే మరియు ఎంపీ  దుకాణ యజమానులకు అండగా నిలిచేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని, అవసరమైతే జిల్లా మంత్రిని జిల్లా కలెక్టర్ ను కలిసి వారికి కొంత సమయం కేటాయిస్తే వారికి వెసులుబాటుగా ఉంటుందని ఆయన అన్నారు.ఎంపీ రచ్చబండ కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారని, ఎమ్మెల్యే  పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా అంతే బిజీగా ఉన్నారని, నేరేడుచర్ల లో ఉన్నది కూడా ప్రజలే కాబట్టి వారి అవసరాలను గుర్తించాలని,కేవలం  ఎన్నికలప్పుడు ఓట్లు వేసే యంత్రాలుగానే వారిని చూడరాదని, ఇలాటి అత్యవసర సందర్భాల్లోనే ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని, మండలంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుని వారికి కొంత సమయం ఇచ్చేందుకు అధికారులను ఒప్పించాలని అందుకు సిపిఐ ఎప్పుడూ ముందు ఉంటుందని ఆయన తెలిపారు