శబరిమలకు కొనసాగుతున్న తాకిడి

 

 

 

వర్షాలను లెక్కచేయకుండా భక్తుల రాక

తిరువనంతపురం,డిసెంబర్‌7 (జనంసాక్షి) : శబరిమలలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కోవిడ్‌ నిబంధనల నేపధ్యంలో భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి ఉత్సాహంగా తరలి వస్తున్నారు. శబరిమలకు యాత్రీకుల తాకిడి గతం కంటే తక్కువ ఉంది.  శబరిమలలో అయ్యప్ప దర్శనానికి ఈ సంవత్సరం యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకూ స్వామి అయ్యప్ప దర్శనాలకు వచ్చినవారి ద్వారా తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు ట్రావెన్‌ కోర్‌ బోర్డ్‌ వెల్లడిరచింది. అయినప్పటికీ ఆదాయం బాగానే వసొంది అని బోర్డ్‌ తెలిపింది. ఇంకా అయ్యప్ప దర్శనానికి సమయం ఉన్నందున ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్‌ మహమ్మారి నేపధ్యంలో రెండేళ్లుగా ఇతర రాష్టాల్ర నుంచి అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ, ఈసారి స్వామి భక్తులు ఎక్కువగా వస్తున్నారు.  శబరిమలలో భారీ వర్షాల కారణంగా శబరిమలలో కమ్యూనికేషన్‌కు అంతరాయం ఏర్పడిరది. ఇటీవల అక్కడ ప్రారంభించిన నూనంగర్‌ వంతెన కూడా దెబ్బతింది. కొండ నీటి ప్రవాహానికి వంతెన పైభాగంలో ఉన్న మెటల్‌ కొట్టుకుపోయింది.  పంప కేఎస్‌ఆర్‌టీసీ సవిూపంలో రోడ్డు కుంగిపోయింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మౌలిక వసతులు ఒక్కొక్కటిగా కుప్పకూలాయి. సాయంత్రం, పంపాలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో యాత్రికులు కాసేపు కొండ పైకి వెళ్ళడానికి ఆటంకం కలిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాతే కొండ ఎక్కేందుకు భక్తులకు అనుమతిస్తున్నారు. ఇక అడవిలో భూమి కుంగి పోయిందనీ, పంపా డ్యామ్‌ షట్టర్లు ఎత్తేశారని వదంతులు రావడంతో యాత్రికులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో స్పష్టమైన సమాధానం లేకపోవడంతో అధికారులు సైతం కంగుతిన్నారు. అంతేకాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆప్టికల్‌ ్గªబైర్‌ కేబుల్‌ కూడా తెగిపోయింది. దీంతో పంపా, సన్నిధానం మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇంటర్నెట్‌ అంతరాయంతో వివిధ కార్యాలయాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడిరది. సోమవారం మధ్యాహ్న సమయంలో కేబుల్‌ మరమ్మతులకు గురైంది. వర్షాలు బాగా పడితే శబరిమలలో కనీస సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. దీంతో అక్కడ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.