శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలి
దిలావర్‌పూర్ : గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని నిర్మల్ సీఐ రఘు సూచించారు ఈ రోజు దిలావర్‌పూర్ మండలంలోని అన్ని గ్రామాల గణేశ్ మండపాల నిర్వాహాకులతో ఆయన ఎంపీడీఓ కార్యాలయాల్లో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. గణేశ్ మండలి నిర్వహకులు ముందుగా పోలీసు అనుమతి పొందాలన్నారు.