శాంతి ఖనిలో రక్షణ పక్షోత్సవాలు.

: శాంతి ఖని గనిని పరిశీలించిన అధికారులు.
బెల్లంపల్లి, అక్టోబర్14, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో శుక్రవారం రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు. కార్మికులు రక్షణతో కూడిన విధులు నిర్వహించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గతంలో కంటే గని ప్రమాదాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని, ఈవ్యవస్థను ఇలాగే కొనసాగించి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. అనంతరం శాంతిఖని గనిలో తనిఖీ చేశారు. ఈకార్యక్రమంలో క్వాలిటీ జీఎం అల్లి రాజేశ్వర్, సేఫ్టీ జీఎం జాన్ ఆనంద్, మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్, ఏజీఎం సుశాంత సాహ, డిజిఎం (ఈ&ఎం) బి చక్రవర్తి, ఎస్ఎస్ఓ ఎం వెంకటేశం, ఎస్ఓఎం బి కృష్ణ ప్రసాద్, ఎస్ఓటు జీఎం సిహెచ్ కృష్ణారావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఓదేలు, ఏరియా ఇంజనీర్ ఎస్వి రామ్మూర్తి, ఏజెంట్ రాజేందర్, శాంతిఖని గ్రూప్ గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, టిజిబికెఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, టిజిబికెఎస్ ఫిట్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్, ఫిట్ ఇంజినీర్ రాంబాబు, వెల్ఫేర్ ఆఫీసర్ టి శ్రీనివాస రావు, ఇతర అధికారులు, యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు