శాంతి భద్రతల పరిరక్షణకు కృషి – ఎస్సై శంకర్

ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 12(జనం సాక్షి): శాంతిభద్రతలకు  ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని ఖానాపూర్ నూతన ఎస్సై రుక్మావార్ శంకర్ అన్నారు. బుధవారం నిర్మల్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చిన ఆయన ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై రజినీకాంత్ పెంబి ఎస్సైగా బదిలీపై వెళ్లారు.