శాంతి స్థాపనే లక్ష్యంగా ప్రవక్త బోదనలు.
బెల్లంపల్లి, అక్టోబర్ 9, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని ప్రతి ఏటా నిర్వహించే మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలో ముస్లింసోదరులు ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా బెల్లంపల్లి స్థానిక అశోక్ నగర్ మసీదు నుండి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారి లో జామ మసీదు వరకు ఉత్సవాలను నిర్వహించారు. సర్వ మానవ సమానత్వం శాంతి స్థాపనే లక్ష్యంగా మహ్మద్ ప్రవక్త బోదనలు సాగాయన్నారు. అనంతరం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారి జన్మదినం జరుపుకోవడం ఆనందంగా వుంది అన్నారు. టీఆరెస్ నాయకుడు పోలు శ్రీనివాస్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తాజ్ , సమీర్, ఖదీర్, పాషా ముస్లిం సోదరులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు